అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కి పాల్పడిన ,ఆన్‌లైన్ గేమింగ్ యాప్ లలో గేమ్స్ ఆడిన, ప్రోత్సాహించిన కఠిన శిక్షలు తప్పవు.
ఆన్‌లైన్ బెట్టింగ్ ,గేమింగ్ కి అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.
సోషల్ మీడియా వేదికగా ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ లను ప్రమోట్(ప్రోత్సాహించే) చేసే వారి సమాచారం అందించాలి.
యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్,గేమ్ యాప్‌లకి అలవాటు పడి అప్పులపాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని,అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కి పాల్పడిన ,ఆన్‌లైన్ గేమింగ్ యాప్ లలో గేమ్స్ ఆడిన, ప్రోత్సాహించిన కఠిన శిక్షలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న భ్రమలో యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ కి బానిసలుగా మరి అప్పులపాలపై ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారని,ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్లు సోషల్ మీడియాలో వీటిని ప్రోత్సహించడం వల్ల యువతలో దీని వ్యసనం పెరుగుతోందని వీటి కట్టడికి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని,అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కి పాల్పడిన ,ఆన్‌లైన్ గేమింగ్ యాప్ లలో గేమ్స్ ఆడిన, ప్రోత్సాహించిన కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుఎన్సర్లు పై,వ్యక్తులపై కేసులు నమోదు కావడం జరుగుతుందన్నారు.
ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ ల నిర్వహకులు సూచనల మేరకే ఆపరేట్ చేయబడుతాయని,బెట్టింగ్ యాప్ లలో డబ్బులు పెట్టుబడిగా పెట్టి ప్రాణాల మీదకు టెక్బుకోవద్దన్నారు.ఆన్‌లైన్ గేమింగ్ మాటున ప్రమాదకర మాల్ వేర్ ఉందని, ఫెక్ లింక్స్ తో వ్యక్తి గత సమాచారం, అకౌంట్ వివరాలు తెలుసుకొనే అవకాశం ఉన్నందున గేమింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అక్రమ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి ప్రచారాన్ని చేయవద్దని, ఆన్‌లైన్ బెట్టింగ్ ,ఆన్‌లైన్ గేమ్స్ వలన కలిగే పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.