Breaking News

జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ గిటే మహేష్ బాబాసాహెబ్ ఐపీఎస్.

జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గిటే మహేష్ బాబాసాహెబ్ తెలియజేసారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీగా నియమించబడిన గిటే మహేష్ బాబాసాహెబ్ ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో అఖిల్ మహాజన్ నుండి బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలుసుకోని పుష్పాగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.

ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక నిఘా …..

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ….. జిల్లా పరిధిలోని సామ్యాసుడిని దృష్టిలో పెట్టికోని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ వుంటుందని, శాంతి భద్రతల విషయంలోను కఠినంగా వుంటామని, ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *