TG: కాలేజీ విద్యార్థులకు 12 అంకెల ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) IDలను ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. కేంద్రం ఆదేశాల మేరకు వన్ నేషన్-వన్ స్టూడెంట్ ID ప్రోగ్రామ్ కింద వీటిని జూన్ నాటికి జారీ చేయాలని కాలేజీలను ఆదేశించింది. విద్యార్థుల అకడమిక్ అచీవ్మెంట్స్, సర్టిఫికెట్స్, క్రెడిట్స్ డిజిటల్గా స్టోర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి ఆధార్, పేరెంట్స్ అనుమతి తప్పనిసరి.
