Breaking News

నిషేధిత పొగాకు ఉత్పత్తులు కలిగి ఉన్న 12 పాన్ షాప్ లపై కేసులు నమోదు..

జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా:

•మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా..సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు..
•నిషేధిత పొగాకు ఉత్పత్తులు కలిగి ఉన్న 12 పాన్ షాప్ లపై కేసులు నమోదు..

క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి
జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వివిధ రకాల అసాంఘిక, చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ బృందాలు జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తూ.. సత్:ఫలితాలను రాబట్టడం జరుగుతుందని, జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఆదేశానుసారం సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు లోకల్ పోలీసులు 6-బృందాలుగా ఏర్పడి సంగారెడ్డి పట్టణ, రూరల్, పటాన్ చెర్వు, పుల్కల్ పోలీసు స్టేషన్ల పరిదిలో మరియు సంగారెడ్డి X-రోడ్డు నుండి ముత్తంగి X-రోడ్డు వరకు గల వివిధ పాన్ షాప్ లపై దాడులు నిర్వహించి, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, ప్రభుత్వంచే నిషేధించబడిన నిషేధిత పొగాకు ఉత్పత్తులు మరియు హుక్కా సామాగ్రిని స్వాధీనం చేసుకొని, షాప్ యజమానులపై  మొత్తం 12 కేసులను నమోదు చేయడం జరిగగింది. 
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా.. జిల్లాలో ఎవరైనా నిషేధిత పొగాకు ఉత్పత్తులు, గంజాయి సాగు లేదా ఇతర మాదకద్రవ్యాలను అక్రమ రవాణా చేసిన అమ్ముతున్నట్లు గుర్తించినట్లైతే S-Nab (సంగారెడ్డి జిల్లా నార్కోటిక్ అనాలసిస్ బ్రాంచ్) సెల్ నెంబర్ 8712656777 కు సమాచారం ఇవ్వండి, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *