Breaking News

హైదరాబాద్‌లో గణనీయంగా తగ్గిన క్రైమ్ రేట్

హైదరాబాద్‌లో గణనీయంగా తగ్గిన క్రైమ్ రేట్: పోలీసుల సమిష్టి కృషిని అభినందించిన సివి ఆనంద్ డిజి, కమిషనర్ ఆఫ్ పోలీసు.
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మరియు డీజీపీ సి.వి. ఆనంద్, ఈరోజు ఉన్నతాధికారులతో క్రైమ్ రివ్యూ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు మరియు సిబ్బంది సమిష్టిగా, సమన్వయంతో కృషి చేయడం వలనే నగరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ప్రశంసించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్‌లో స్పష్టమైన తగ్గుదల కనిపించిందని, ఇది పోలీసుల నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.

సైబర్ క్రైమ్ డిటెక్షన్‌లో మెరుగుదల: సైబర్ నేరాల నియంత్రణలో హైదరాబాద్ పోలీసులు మంచి ప్రతిభ కనబరిచారు. కేసుల సంఖ్య తగ్గడమే కాకుండా, డిటెక్షన్ రేటు కూడా గత ఏడాది 40% ఉండగా, ఈ ఏడాది అది 42%కు మెరుగుపడింది.
ఆస్తి సంబంధిత నేరాలు (Property Offences): మొత్తం ఆస్తి సంబంధిత కేసులలో గత ఏడాది (సెప్టెంబర్ 2023 – ఆగస్టు 2024) 5,484 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది (సెప్టెంబర్ 2024 – ఆగస్టు 2025) ఆ సంఖ్య 4,082కు తగ్గింది. అనగా 26% తగ్గుదల నమోదైంది. రికవరీ రేటు కూడా గత ఏడాది 54% ఉండగా, ఈ ఏడాది అది 55%కు మెరుగుపడింది.

నల్లగొండ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ..

మొత్తం అన్ని కేసులలో గత ఏడాది (సెప్టెంబర్ 2023 – ఆగస్టు 2024) 38206 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది (సెప్టెంబర్ 2024 – ఆగస్టు 2025) ఆ సంఖ్య 31533కు తగ్గింది. అనగా 17% తగ్గుదల నమోదైంది అని తెలిపారు.
ఈ సందర్భంగా సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, “హైదరాబాద్ సిటీ పోలీసులందరూ ఒక టీమ్‌వర్క్‌గా పనిచేసి శాంతి భద్రతలను కాపాడటంలో అద్భుతమైన ఫలితాలను సాధించారు. దీని ఫలితంగానే నగరంలో పండుగలు, ఊరేగింపులు, సభలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. ఈ విజయానికి కారణమైన ప్రతి అధికారికి మరియు సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు. సమిష్టి కృషితో ఏదైనా నిర్వహించగలమని నిరూపించాము. ఇదే స్ఫూర్తిని కొనసాగించి, హైదరాబాద్‌ను ‘నేర రహిత నగరం’గా మార్చాలి” అని పిలుపునిచ్చారు.
సమావేశానికి హాజరైన సీనియర్ అధికారులు: విక్రం సింగ్ మాన్, అదనపు సీపీ (ఎల్ & ఓ); పి. విశ్వ ప్రసాద్, ఐపీఎస్, అదనపు సీపీ (క్రైమ్స్); డి. జోయెల్ డేవిస్,జాయింట్ సీపీ (ట్రాఫిక్); పరిమళ హనా నూతన్, జాయింట్ సీపీ (అడ్మిన్); ఎన్. శ్వేత, ఐపీఎస్, డీసీపీ (డీడీ); కె. శిల్పావల్లి,డీసీపీ (సెంట్రల్ జోన్); ఎస్. ఎం. విజయ్ కుమార్, డీసీపీ (వెస్ట్ జోన్); ఎస్. రష్మి పెరుమాళ్, డీసీపీ (నార్త్ జోన్); బి. బాలస్వామి, ఐపీఎస్, డీసీపీ (ఈస్ట్ జోన్); స్నేహ మెహ్రా, డీసీపీ (సౌత్ జోన్);కె. అపూర్వ రావు, ఐపీఎస్, డీసీపీ (స్పెషల్ బ్రాంచ్); కె. రాహుల్ హెడ్గే, డీసీపీ (ట్రాఫిక్); ఆర్. వెంకటేశ్వర్లు, డీసీపీ (ట్రాఫిక్); ధారా కవిత, డీసీపీ (సైబర్ క్రైమ్); లావణ్య నాయక్ జాదవ్, డీసీపీ (వుమెన్స్ సేఫ్టీ); జి. చంద్రమోహన్,డీసీపీ (సౌత్ వెస్ట్ జోన్); ఎస్. చైతన్య కుమార్, డీసీపీ (సౌత్ ఈస్ట్ జోన్);ఎస్. శ్రీనివాస్, డీసీపీ (ట్రాఫిక్); వై.వి.ఎస్. సుధీంద్ర, డీసీపీ (టాస్క్ ఫోర్స్); కె. పుష్ప, డీసీపీ (ఐటీ సెల్) మరియు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *