
నలుగురు నిందితులు అరెస్ట్, మరో ఇద్దరు పరారీ. వీరి వద్ద నుండి రెండు ఎర్తిగా కార్లు, 8,50,000/- విలువ గల రెండు లారీలు స్వాధీనం.
- మెండే వెంకన్న (35 సం) లారి డ్రైవర్, అయిటిపాముల గ్రామం, కట్టంగూర్ మండలం, నల్గొండ జిల్లా
2.గుజ్జేంటి శ్రీనివాస్ (47 సం), లారి డ్రైవర్, అయిటిపాముల గ్రామం, కట్టంగూర్ మండలం, నల్గొండ జిల్లా
3.కొరుపుల సాయి కుమార్ (28 సం), లారీ డ్రైవర్, అయిటిపాముల గ్రామం, కట్టంగూర్ మండలం, నల్గొండ జిల్లా
4.కొండా సురేష్ (35 సం), లారీ డ్రైవర్, (పరారీ), ఇనుపముల గ్రామం కేతేపల్లి మండలం, నల్గొండ జిల్లా (పరారీ)
5.అరికే రవి (48 సం), కొత్తగూడెం జిల్లా
6 షేక్ హబీబ్ రహమాన్ (27 సం), ఆటో నగర్, విజయవాడ (పరారీ)
తిప్పర్తి పోలీస్ స్టేషన్ నుండి మీడియాకు వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి.
నల్గొండ పట్టణం రామ్ నగర్ కు చెందిన పాలడుగు రాజు తన లారీని తిప్పర్తి పోలీస్ స్టేషన్ పక్కన గల మార్కెట్ యార్డ్ నందు పార్కింగ్ చేయగా తేదీ 24.12.204 న లారీ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించుకు వెళ్ళినారని చేసిన ఫిర్యాదు మేరకు తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో Cr.no 232/24 u/s 303(2) BNS కేసు నమోదు చేసుకుని దర్యాప్తు లో భాగంగా సీఐ శాలిగౌరారం, ఎస్ఐ తిప్పర్తి వారి పోలీస్ సిబ్బంది నిన్న సాయంత్రం తిప్పర్తి సెంటర్ లో నకిరేకల్ రోడ్డు వైపు వాహనా తనిఖీలు చేస్తుండగా రెండు ఎర్టిగా కార్లు నెంబర్ ప్లేట్ లేకుండా అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో కారులో ఉన్న నలుగురు వ్యక్తులను ఆపి విచారించగా ఇట్టి నలుగురు వ్యక్తులు పోలీస్ లకు పట్టుబడి కాకుండా నంబర్ ప్లేట్ లేని కారులో రాత్రిపూట తిరుగుతూ రహదారుల వెంబడి మీద చీకటి ప్రదేశాల్లో పార్క్ చేసిన లారీలను దొంగతనం చేసి విజయవాడలోనీ ఆటో నగర్ ఏరియాలో ఇట్టి దొంగలించిన లారీలను అమ్మి సులువుగా డబ్బులు సంపాదిస్తామని నేరాన్ని ఒప్పుకున్నారు.
1.ఇట్టి నేరస్తులు డిసెంబర్ 23 ,2024 న తిప్పర్తి మండలం లోని మార్కెట్ యార్డ్ లో పార్క్ చేసిన
AP-29-TB- 3445 రాత్రి దొంగలించి విజయవాడ ఆటో నగర్ లో షేక్ హబీబ్ కు అమ్మినారు.
(Cr.no 232/24 u/s 303(2) BNS of PS Thipparthy) - ఇట్టి నేరస్తులు జనవరి 5,2025 న చిట్యాల మండలం పెద్దకాపర్తి పెట్రోల్ బంక్ లో పార్క్ చేసిన AP-29-TA-8819 తెల్లవారు జామున దొంగలించి విజయవాడ ఆటో నగర్ లో షేక్ హబీబ్ కు అమ్మినారు. (Cr.no 04/25 U/s 303(2) BNS of PS Chityala)
- నేరస్తుడు మెండే వెంకన్న మరొక నేరస్తుడు గుంజేటి శ్రీను పేరు మీద ఫైనాన్స్ లో లారీ తీసుకుని EMI లు కట్టకుండా ఫైనాన్స్ వారిని మోసం చేసి ఇట్టి ఫైనాన్స్ లారీ ని విజయవాడ ఆటో నగర్ లో షేక్ హబీబ్ కు అమ్మినారు. ఇట్టి నెరస్థుల వద్ద నుండి రెండు కేసులలో రెండు ఎర్తిగా కార్లు, 8,50,000/- విలువ గల రెండు లారీలు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించనైనది. వీరిలో A-4 కొండా సురేష్,A-6 షేక్ హబీబ్ లు పరారీలో ఉన్నారు. ఇట్టి లారీ దొంగతనం కేసును చేదించిన సిఐ శాలిగౌరారం కే. కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ తిప్పర్తి బి.సాయి ప్రశాంత్ ని, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, రాము మరియు తిప్పర్తి పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ అభినందించారు.
