
2020 మే 19న మహబూబ్ నగర్ జిల్లా, కాకర్లపహాడ్ గ్రామంలో పాతకక్షల కారణంగా ఫిర్యాదుదారు పశం కనకయ్య, గుట్ట నర్సిములు, పశం యాదయ్యలపై నిందితులు కత్తి, ఇనుపరాడ్, ఖాళీ బీరు సీసాలతో దాడి చేసి తీవ్ర గాయాలు కలిగించారు. ఈ ఘటనపై నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో Cr.No.57/2020 U/s 307 r/w 34 IPC కింద కేసు నమోదు చేసి, పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం అదనపు సహాయ సెషన్స్ న్యాయమూర్తి శ్రీమతి జి. రాధిక నిందితులకు కింది శిక్షలు విధిస్తూ తీర్పు వెలువరించారు. 1.థనం రాజు S/o పెంటయ్య, 2.థనం నారాయణ S/o పెంటయ్య, 3.ధడహకి భాను తేజా S/o శ్రీనివాసులు. ప్రతి నిందితునికి 5 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష ఒక్కొక్కరికి రూ. 2,000/- జరిమానా దర్యాప్తు & న్యాయపరమైన చర్యల్లో కృషి చేసిన అధికారులు : చ. శ్రీకాంత్, SI (ప్రాథమిక I.O.)విక్రం, SI (ప్రస్తుత I.O.)
భక్తియార్ బాబా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగి రెడ్డి, ASI (కోర్టు లైజన్ అధికారి) రాజు గౌడ్, PC 1277 (కోర్టు డ్యూటీ ఆఫీసర్) వీరి కృషిని జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.“ఈ కేసులో న్యాయస్థానం ద్వారా నిందితులకు శిక్ష విధించబడటం వల్ల బాధితులకు న్యాయం జరిగిందని, ఇది పోలీసుల కృషి మరియు న్యాయవ్యవస్థ బలానికి నిదర్శనమని” ఎస్పీ తెలిపారు.