
సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నందు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.ప్రతి నెల నిర్వహించే క్రైమ్ రివ్యూ మీటింగ్ లో ఈ వర్టికల్ విభాగంలో ప్రదర్శన ఆధారంగా రివ్యూ నిర్వహించడం జరుగుతుందని, వర్టికల్ విభాగంలో ఉన్న అధికారులు సిబ్బంది క్రమం తప్పకుండా వర్టికల్ నియమాలను పాటిస్తూ.మెరుగైన ప్రదర్శన చూపాలని ఎస్పీ సూచించారు. డైల్ 100 కాల్స్ కు త్వరితగతిన స్పందించాలని, వీలైనత తక్కువ సమయంలో నెరసత్యలనికి చేరుకొని నేరం తీవ్రతను తగ్గించాలని అన్నారు. బ్ల్యుకోర్ట్/ పెట్రో కార్ సిబ్బంది తమ ఏరియాలో గల నేరస్తులను, అనుమానితులను క్రమం తప్పకుండా చెక్ చేయాలని, చెకింగ్ రిపోర్ట్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సిటిజన్స్ ఫీడ్ బ్యాక్ క్యూఆర్ కోడ్ ను అందరికీ కనిపించే విధంగా ఉంచాలని, సిటిజన్స్ యొక్క విలువైన సలహాలకు ప్రాధాన్యత ఉంటుంది అన్నారు. యాక్సిడెంట్స్, ఆస్థి సంబంధిత నేరాలలో, మర్డర్, గాంజయి కేసులలో లొకేషన్లను గుర్తించి ఆన్లైన్లో అప్డేట్ చేయాలని సూచించారు. ఆయా కేసులలో నిర్ణీత గడువులలో చాట్ షీట్లను కోర్టులో సమర్పించాలని, కేసు ప్రాపర్టీకి సంబంధించిన, సీజ్ చేయబడిన వస్తువులను కోర్టు నందు సబ్మిట్ చేయాలని సూచించడం జరిగింది. అన్ని వర్టికల్ విభాగాలలో మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పుడే జిల్లా ముందువరుసలో ఉంటుందని, అందుకు అన్ని ర్యాంకులకు చెందిన వర్టికల్ అధికారులు సిబ్బంది ఉత్తమ ప్రదర్శన కనబరచాలని సూచించడం జరిగింది. వర్టికల్ విభాగంలో ప్రతిభ ఆధారంగా రివార్డులు అందించడం జరుగుతుందిని ఎస్పీ అన్నారు.