
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్లలో వినాయక నిమజ్జన వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. సిరిసిల్ల మానేరు తీరంలోని బ్రిడ్జి వద్ద, ప్రేమ్ నగర్ లో నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శోభాయాత్రను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితేతో కలిసి పరిశీలించారు. నిమజ్జన స్థలం వద్ద అధికారులకు పలు సూచనలు చేశారు. మ్యాజిక్, మిమిక్రీ షో భక్తులను అలరించింది. పిల్లలు, పెద్దలు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
