Breaking News

నల్లగొండ పట్టణ శాంతి సంఘం సభ్యులతో సమావేశం-కె శివరాం రెడ్డి, నల్గొండ డి.ఎస్.పి.

రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఉద్దేశించి, నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆదేశానుసారం, నల్లగొండ సబ్ డివిజన్ డి.ఎస్.పి కె శివరాం రెడ్డి నల్గొండ పట్టణంలోని శాంతి సంఘం సభ్యులతో, గణేష్ నిర్వాహకులతో పట్టణంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో శాంతి సంఘ సమావేశం ఏర్పాటు చేసి, మాట్లాడుతూ, నల్లగొండ పట్టణ ప్రజలు గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, అదేవిధంగా గణేష్ మండప నిర్వాహకులకు ఈ క్రింది సూచనలు చేశారు:
గణేష్ ఏర్పాటు వివరాలను విధిగా ఆన్లైన్ చేసుకోవాలి. గణేష్ మండపం వద్ద మైక్ సెట్ ల సౌండ్ వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. మండపాలను రోడ్డు మధ్యలో కాకుండా కాలనీలలోని ఖాళీ ప్రదేశంలో పెట్టుకోవడం వల్ల ఇతరులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది. మండపం వద్ద టపాకాయలు గాని, అగ్నికి కారణమగు వస్తువులను ఉండనివ్వకూడదు. మండపం వద్ద జరుపు కార్యక్రమాలు రోడ్డుపై పోవు వారికి అసౌకర్యం కలిగించకుండా చూసుకోవాలి. మీ వాలెంటీర్లను జన సమూహాన్ని క్రమబద్దీకరించునట్లు మండప నిర్వాహకులు తగు చర్యలు తీసుకోవాలి. మండపాన్ని మూయుటకు ముందు ప్రతి రాత్రి, విగ్రహం వద్ద వెలిగించివున్న నూనె దీపాల విషయములో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేనిచో దీపం క్రిందపడి అగ్ని ప్రమాదం జరిగే అవకాశమున్నది అని గమనించాలి. గణేష్ మండపం వద్ద కొత్త వస్తువులు గాని, బ్యాగ్ లు గాని, బ్రీఫ్ కేసులు గాని, బొమ్మలు తదితర అనుమానాస్పద వస్తువుల గురుంచి చూడాలి. అట్టి వస్తువుల్లో ప్రేలుడు పదార్థాలు ఉండే అవకాశం ఉంది. అందువలన మండప నిర్వాహకులు ప్రతి రోజు మండపాన్ని సోదా చేసి వాటి విషయమై పరిశీలించి, ఏదైనా అవసరమున్నచో వెంటనే సంబంధిత పోలీసు వారికి తెలియచేయగలరు. మండపం వద్ద ఇసుక బస్తాలను, నీటి బకెట్లను అగ్ని నిరోధకంగా ఉంచాలి. సాంస్కృతిక కార్యక్రమాలకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనుమతి తప్పనిసరి మరియు రాత్రి 10 గంటల లోపు ముగించాలి. రాత్రి సమయంలో గణేష్ మండపం నందు ఉత్సవ కమిటీ వారు కనీసం ఇద్దరు మండపం వద్ద ఖచ్చితంగా ఉండాలి. అనంతరం పీస్ కమిటీ సభ్యులు ఇచ్చిన సూచనలను, సలహాలను గణేష్ మండప నిర్వాహకులు పాటించాలని సూచించారు. ఇట్టి సమావేశంలో నల్గొండ RDO అశోక్ రెడ్డి మాట్లాడుతూ, గణేష్ నిర్వాహకులకు తగు సూచనలు ఇస్తూ, భక్తులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని డిపార్ట్మెంట్స్ తో సమన్వయము చేస్తూ, జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నల్గొండ టూ టౌన్ సిఐ రాఘవరావు, నల్గొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మహాలక్ష్మయ్య, నల్గొండ వన్ టౌన్ ఎస్ఐ గోపాలరావు, నల్గొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు, నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబు, మున్సిపల్ కమిషనర్ , గ్రంథాలయ ఛైర్మెన్ హఫీజ్ ఖాన్, అబ్బగోని రమేష్, లక్ష్మయ్య, ఖలీం, హశం, వీరెల్లి చంద్ర శేఖర్, కర్నాటి యాదగిరి, కౌన్సిలర్స్ అదేవిధంగా నల్గొండ పట్టణ పీస్ కమిటీ సభ్యులు, గణేష్ మండప నిర్వహకులు పాల్గొన్నారు.

వాలెంటైన్స్ డే సందర్భంగా సైబర్ మోసాలపై హెచ్చరిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *