
ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు.
పాత నేరస్తులు సత్ప్రవర్తనతో జీవితాలను సరిదిద్దుకోవాలి:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని వివిధ రకాల నేరాల్లో నిందితులుగా ఉండి రౌడీ షీట్లు,హిస్టరీ షీట్లు , సస్పెక్ట్స్ గా ఉన్న వారికి కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించి సత్ప్రవర్తనతో జీవితాలను సరిదిద్దుకోవాలే తప్ప తరచు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చటించారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నేరాల్లో నిందితులుగా ఉండి షీట్లు తెరువబడిన నేరచరితులు విధిగా పోలీసు వారు తెలిపిన సమయాల్లో పోలీస్ స్టేషన్ హాజరు కావాలని లేని పక్షంలో వారిని బైండోవర్ చేయడం జరుగుతుందని అన్నారు. రౌడీ,హిస్టరీ షీట్స్ ఉన్నవారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరాలకు దూరంగా ఉండటంతో పాటు సత్ప్రవర్తనతో మెదులుతున్న వారిని గుర్తించి వారిపై ఉన్న షీట్స్ ను తొలగించడం జరుగుతుందని వివరించారు. రౌడీ, హిస్టరీ అనుమానాస్పద,అల్లర్లు లో ప్రమేయం ఉన్నవారిని ప్రతి నెల పోలీస్ స్టేషన్ కు పిలిపించి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, రామ్మోహన్, శ్రీకాంత్,రమాకాంత్, గణేష్, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
