
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం 08:30 గంటలకు సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్, జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందితో కలిసి జాతీయ గీతం ఆలపించారు. జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మాతృభూమి కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి సాధించిన ఈ స్వాతంత్ర్య భారత్ నేడు 78 వసంతాలను పూర్తి చేసుకుందని అన్నారు. ఈ సందర్భంలో ఆ మహనీయులను స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని గుర్తుచేశారు. బానిస సంకెళ్ళను తెంచుకొని సాధించుకున్న ఈ స్వాతంత్ర్య భారత రాజ్యాంగాన్ని కొన్ని శక్తులు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, భారతదేశం శత్రు దేశాలచే చుట్టుముట్టబడి ఉన్న దేశాల నుండి, అంతర్గత శత్రువుల ముప్పుల నుండి దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని, పోలీసులుగా మన పాత్ర అత్యంత కీలకమని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగలు మన విధులు, సమాజానికి అందించాల్సిన సేవలను గుర్తు చేసే వేడుకలని, భిన్న భాషలు, జాతులు, మతాల సమ్మిళితం మన భారతదేశం అని, విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలున్న వ్యక్తులు మరియు సమూహాల మధ్య సామరస్యం, ఐక్యత భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుందని తెలియజేశారు. భారతీయులుగా పుట్టినందుకు ప్రతి ఒక్కరం గర్వపడాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మన విధులను నిబద్ధతతో, అంకితభావంతో నిర్వర్తిస్తే సరిహద్దుల్లో సేవలందిస్తున్న సైనికుల త్యాగాలకు సమానంగా మన సేవలు నిలుస్తాయని గుర్తుచేశారు. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అదే ధృఢసంకల్పంతో తమ కర్తవ్యాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారు ఇ. కళ్యాణి, సంగారెడ్డి డిఎస్పీ సత్యయ్య గౌడ్, డి4సి డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, ఎఆర్. డి.యస్.పి ఎ.నరేందర్, యస్.బి. ఇన్స్పెక్టర్స్ కిరణ్ కుమార్, డి.సి.ఆర్.బి. ఇన్స్పెక్టర్ రమేష్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి ఆర్.ఐ. లు రామరావ్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, యస్.బి.,డి.సి.ఆర్.బి. యస్.ఐ. లు, డి.పి.ఒ సూపరింటెండెంట్ లు అశోక్, మోహనప్ప, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తమ సేవ పతకం: కే. అంజిరెడ్డి ఎస్ఐ డిసిఆర్.బి, పి. సుదర్శన్ హెడ్ కానిస్టేబుల్, సేవా పథకం: వి.శివకుమార్ ఇన్స్పెక్టర్, వై.బక్కయ్య ఎస్ఐ, బి.విశ్వనాథం ఎస్ఐ, ఎ.యాదగిరి ఏ ఎస్ఐ, కె. నాందేవ్ ఎఆర్. ఎస్ఐ, యం. ధర్మ ఎఆర్. ఎస్ఐ, యం. లక్ష్మన్ ఎఆర్. ఎస్ఐ, సయ్యద్ అబ్దుల్ నయీం ఎఆర్. ఎస్ఐ, ఎ.భాగ్యం గౌడ్ ఎఆర్. ఎస్ఐ, వి.సుదర్శన్ హెడ్ కానిస్టేబుల్, అబ్దుల్ రఫీక్ హెడ్ కానిస్టేబుల్, సీహెచ్ సాయిలు హెడ్ కానిస్టేబుల్, వి.శంకర్ హెడ్ కానిస్టేబుల్, అబ్దుల్ భారి కానిస్టేబుల్.జిల్లా ఆయుధాగారం (AR HQRTS) లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు: సంగారెడ్డి జిల్లా ఆయుధాగారంలో ఎఆర్. డి.యస్.పి. నరేందర్ జాతీయ జండాను ఆవిష్కరించి, సిబ్బందితో కలిసి జాతీయగీతాలాపన చేసారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ.లు రాజశేఖర్ రెడ్డి, రామరావ్, డానియెల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

