Breaking News

దేశ సేవకు పునరంకితం కావాలి – జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులకు,సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ. ప్రతీ ఒక్కరూ దేశసేవకు పునరంకితం కావాలన్నారు. స్వాతంత్ర పోరాటాన్ని గుర్తు చేసుకోవడం,భారతదేశానికి స్వేచ్ఛ కల్పించిన త్యాగధనులను స్మరించుకోడం మనందరి బాధ్యత అన్నారు. పోలీసు అధికారులు జాతి సమగ్రత, సమాజంలో శాంతి స్థాపనకు కృషి చేయాలన్నారు. ఎందరో మహానుభావులు త్యాగఫలమే ఈరోజు మనందరం స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు. మహానుభావుల త్యాగాలను నిరంతరం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. ఈకార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు,ఆర్.ఐలు ,ఎస్.ఐ లు,పోలీస్ కార్యాలయ సిబ్బంది,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

చెర్లపల్లి సెంట్రల్ జైలు సందర్శించిన ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీలు – జైలు సంస్కరణలపై అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *