
అక్రమంగా గంజాయి విక్రయిస్తూ, గంజాయి తాగుటకు బానిసలై బైక్ దొంగతనలు చేస్తూ వాటి పై రాత్రి వేళలో తాళం వేసిన ఇండ్లలల్లో దొంగతనాలకి పాల్పడుతున్న అంతర్ జిల్లా నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీస్. కె.శివరాం రెడ్డి డీఎస్పీ నల్గొండ.
- నలుగురు నిందితులు అరెస్టు.
- వీరి వద్ద నుండి 50 వేల విలువ గల 02 కిలోల గంజాయి,04 బైక్ లు, ఒక లెనోవా ట్యాబ్ .
1) కొడావత్ విక్రమ్ @ వికీరి తండ్రి శంకర్, 2)వడ్త్య నాగరాజు @ చింటూ@ లిప్ట తండ్రి గోపాల్, 3)ధనావత్ సందీప్ నాయక్ @ సొల్లు @ శాండీ తండ్రి శ్రీను, 4)జరుప్లా నవీన్ కుమార్@ ముజ్జు తండ్రి హరి.
తెలంగాణ రాష్ర్ట౦ ప్రతిష్టాత్మికంగా తీసుకొన్న మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగ౦గా మరియు ఆస్తి సంబందిత నేరాలను అరికట్టుట లో మరియు చేధించుట లో భాగంగా నల్గొండ జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ IPS ఆదేశాల మేరకు S.I నార్కెట్ పల్లి మరియు సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు నార్కెట్ పల్లి గ్రామ శివారులో గల మద్రాస్ ఫిల్టర్ కాఫి కి దగ్గరలో ఉదయం అందాజా 06:00 గంటల సమయములో నిందితులు నార్కెట్ పల్లి చుట్టు ప్రక్కల ఉన్న మహాత్మా గాంధీ యునివర్సిటి మరియు కామినేని కాలేజి స్టూడెంట్స్ కు మరియు అవసరం ఉన్న వ్యక్తులకు గంజాయి అమ్మడం కొరకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం మేరకు నార్కెట్ పల్లి SI డి.క్రాంతి కుమార్, వారి సిబ్బందితో యుక్తముగా నార్కెట్ పల్లి గ్రామ శివారు లో మద్రాస్ ఫిల్టర్ కాఫి దగ్గరలో వెళ్ళి అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను పట్టుబడి చేసి వారిని విచారించగా అట్టి నిందితులు సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని ఒక పథకం ప్రకారం హైదరాబాద్ లో దూల్ పేటలో 2 కేజీల గంజాయిని కొనుగోలు చేసి గంజాయిని తీసుకొని నార్కెట్ పల్లి కి దొంగిలించిన ద్వి చక్ర వాహనాలపై వచ్చినారు. అట్టి గంజాయిని నార్కెట్ పల్లి గ్రామ శివారులో గల మద్రాస్ ఫిల్టర్ కాఫి దగ్గరలో గంజాయి తాగే వారికి నార్కెట్ పల్లి చుట్టు ప్రక్కల ఉన్న కాలేజి స్టూడెంట్స్ కు మరియు అవసరం ఉన్న వ్యక్తులకు గంజాయిని చిన్న చిన్న పాకెట్ల లో తయారు చేసి అమ్మాలని ప్రయత్నిస్తుండగా ఉదయం 07:15 గంటలకు నార్కెట్పల్లి గ్రామ శివారులో మద్రాస్ ఫిల్టర్ కాఫి దగ్గరలో నార్కెట్ పల్లి పోలీసు వారు పట్టుబడి చేసి నిందితుల వద్ద నుండి 2 కేజి ల మరియు 4 ద్విచక్ర వాహనాలు మరియు 1 లేనోవా టాబ్ లను స్వాధీనం చేసుకోనైనది. ఇట్టి నేరంలో వారి పై Cr.No.19/2025 U/s 8 (C) 20(b)(ii)(B), 29 of NDPS Act-1985 Amendment Act 2001 ప్రకారంగా Narketpally PS నందు కేసు నమోదు చేసి కోర్ట్ లో హాజరు పర్చనైనది.
వీరి పై గతం లో, వీరు మైనర్ గా ఉన్న సమయం నుండి గంజాయి కు అలవాటు పడి దొంగతనలు చేస్తూ ఉండటంతో హయత్ నగర్, L.B నగర్, యాచారం,చౌటుప్పల్, సరూర్ నగర్, అచ్చంపేట, అబ్దుల్లాపూర్ మెట్, ఘట్కేసర్, ఆదిబట్ల, త్రిపురారం, నాచారం, కొండమల్లేపల్లి, దేవరకొండ, S.R నగర్ పోలీసు స్టేషన్ లల్లో సుమారు A-1 పై 20 కేసులు, A-2 పై 11 కేసులు A-3 పై 23 కేసులు A-4 పై 09 కేసులల్లో నిందితులుగా వుండి అరెస్టు అయ్యి జైల్ కి వెళ్లొచ్చారు. అయిన వారి ప్రవర్తనలో మార్పు రాక, చెడు వ్యసcలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో తాము అనుకున్న పథకం ప్రకారముగా గంజాయి విక్రయించడంతో పాటు ఒక ఇనుప రాడ్డు సహాయముతో రాత్రి సమయంలో తాళం వేసి వున్న ఇండ్లను లక్షంగా చేసుకొని తాళం పగులగొట్టి, తాళం పగలగొట్టడం తో పాటు ద్విచక్ర వాహనాల దొంగతనాలకి పాల్పడుతున్నారు. 1. నార్కెట్ పల్లి P.S, నాలుగు కేసులు నమోదు( 02 house break, 01 NDPS case and 01 bike theft case), 2. చౌటుప్పల్ P.S, మూడు కేసులు నమోదు. (03 bike theft cases), 3. లేనోవా టాబ్ దొంగిలించిన దానిపై వనస్థలిపురం P.S నందు ఒక కేసు నమోదు, 4. సరూర్ నగర్ P.S ఒక హౌస్ బ్రేక్ కేసు నమోదు. ఇట్టి కేసును నల్గొండ DSP, K. శివరాం రెడ్డి పర్యవేక్షణలో నార్కెట్ పల్లి C.I K. నాగరాజు ఆద్వర్యంలో నార్కెట్ పల్లి S.I D.క్రాంతి కుమార్ మరియు వారి సిబ్బంది ASI-ఆంజనేయులు, HC రాము, PCs సత్యనారాయన, అఖిల్, గిరిబాబు, తిరుమల్, శివశంకర్, మహేశ్, హరిప్రసాద్, మరియు సాయి కుమార్ లను జిల్లా S.P అభినందించనైనది.
అక్రమ గంజాయి, మాదకద్రవ్యాలు సరఫరా చేసినా, అమ్మినా, మరియు ఎవరైనా వినియోగించినా/వాడినా ఉపేక్షించేది లేదు: జిల్లా యస్పి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాదకద్రవ్య వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉక్కుపాదంతో అణిచివేస్తామని, ఎంతటి వారినైనా ఉపేక్షించమని, యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అని, గంజాయి, సరఫరా, అమ్మే వ్యక్తుల పైనే కాకుండా, సేవించే/వినియోగించే వ్యక్తుల పైన కూడా చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా S.P హెచ్చరించనైనది. గంజాయి, మాదక ద్రవ్యాలు విక్రయాల గురించి గాని, సేవించే వ్యక్తుల గురించి, ఏ రూపంలోనైనా మాదకద్రవ్యాలను సరఫరా చేసేవారి గురించి మీకు సమాచారం తెలిసిన వెంటనే, డయల్ 100 మరియు డయల్ 8712670266 ద్వారా లేదా నేరుగా మా పోలీసు సిబ్బందికి లకు తెలియజేయవచ్చును. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మాదకద్రవ్యాల నివారణలో ప్రజలు, పోలీసు వారికి సహకరించి, మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో అందరూ పాలుపంచుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే జిల్లాలో దొంగతనాల నివారణకు పటిష్ఠ నిఘా, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని,జిల్లాలో దొంగతనాలు నివారణకు పగలు రాత్రి పటిష్ఠ గస్తీ నిర్వహిస్తూ, పాత నేరస్తుల కదలికలపైన ఎప్పటికప్పుడు నిఘా పెట్టామని తెలిపారు. జిల్లా ప్రజలు కూడా మీ ఇంటి పరిసరాల్లో, కాలనీల్లో, షాపులలో సిసిటివి కెమెరాలు అమర్చుకోవడం చాలా ముఖ్యమని, ఏదైనా సంఘటన జరిగిన వెంటనే సంబంధిత వ్యక్తుల కదలిక పై తగు చర్యలు తీసుకునుటకు వీటి ప్రాముఖ్యత చాలా అవసరం ఉంటుందని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాల్లో కాలనీల్లో,షాపులలో మరియు ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.