
పాఠశాలలకు సెలవులు రావడంతో పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత పనిలో ఉన్నా సరే పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS సూచించారు. పిల్లల పట్ల అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని అయన అన్నారు. పిల్లలను బావుల్లో, చెరువుల్లో ఈత కొట్టేందుకు పంపించొద్దని , ఈత నేర్పించాల్సిన అవసరమైతే తామే స్వయంగా వారికి తోడుగా వెళ్లలని అన్నారు. మైనర్ లను బైక్ నడపమని చెప్పొద్దు. పిల్లలకు బైక్ తాళాలు కనిపించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు వారికి ఇవ్వొద్దు. ఇవ్వాల్సిన అవసరం అయితే మీ కనుచూపు మేరలోనే ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. ప్రత్యేక గదిలో ఒంటరిగా ఉండడం వల్ల అనర్థాలకు దారి తీస్తుంది. స్నేహితులతో కలిసి దూరప్రాంతాలకు పంపకండి.
ఇంట్లో పెద్దలతో పిల్లలు ఎక్కువ సమయం గడిపేలా చూడాలి. వీలైనంత వరకు పిల్లలను ఇంట్లోనే ఉంచుకుని మన సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించాలి. కాలిగా ఉంచకుండా పిల్లలకు ఆసక్తి గల ఆంశాలపై (డ్యాన్సు, సంగీతం) అవసరమైన శిక్షణ ఇప్పించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలని రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలి.