బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాలపై అత్తాపూర్ పోలీసులు కీలక హెచ్చరిక.. భారీ డీజే సౌండ్ సిస్టమ్‌లపై నిషేధంహైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులుఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తువిధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రత ముఖ్యం: తొర్రూర్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్పాతకక్షలతో రౌడీషీటర్ దారుణ హత్య: 48 గంటల్లో కేసు ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు – 180 కేసుల నిందితుడితో సహా ముగ్గురు అరెస్ట్గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిగణేష్ ఉత్సవాలపై అత్తాపూర్ పోలీసులు కీలక హెచ్చరిక.. భారీ డీజే సౌండ్ సిస్టమ్‌లపై నిషేధంహైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులుఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తువిధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రత ముఖ్యం: తొర్రూర్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్పాతకక్షలతో రౌడీషీటర్ దారుణ హత్య: 48 గంటల్లో కేసు ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు – 180 కేసుల నిందితుడితో సహా ముగ్గురు అరెస్ట్గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలి
Hyderabad

గణేష్ ఉత్సవాలపై అత్తాపూర్ పోలీసులు కీలక హెచ్చరిక.. భారీ డీజే సౌండ్ సిస్టమ్‌లపై నిషేధం

గణేష్ ఉత్సవాలపై అత్తాపూర్ పోలీసులు కీలక హెచ్చరిక.. భారీ డీజే సౌండ్ సిస్టమ్‌లపై నిషేధం

హైదరాబాద్: రాబోయే గణేష్ చతుర్థి ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల నేపథ్యంలో అత్తాపూర్ పోలీసులు డీజే సౌండ్ సిస్టమ్ యజమానులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో డీజే సౌండ్ సిస్టమ్ యజమానులతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో తెలంగాణ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పోలీసు అధికారులు వివరించారు. ఉత్సవాల సందర్భంగా శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు డీజే సౌండ్ సిస్టమ్‌ల వినియోగంపై నిబంధనలు అమలులో ఉన్నాయని స్పష్టం చేశారు.

రెండు సౌండ్ బాక్సులకే అనుమతి

నిబంధనల ప్రకారం ప్రార్థనా ప్రదేశాలు, ఊరేగింపులలో కేవలం రెండు సాధారణ సౌండ్ బాక్సులను మాత్రమే పరిమిత శబ్ద తీవ్రతతో వినియోగించేందుకు అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు.

అయితే భారీ డీజే సిస్టమ్‌లు, సౌండ్ వాల్స్ వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని హెచ్చరించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి డీజే సిస్టమ్‌లను ఏర్పాటు చేసినా, శబ్ద కాలుష్యానికి పాల్పడినా సంబంధిత డీజే యజమానులు, ఉత్సవ నిర్వాహకులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా వినియోగించే సౌండ్ పరికరాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.

హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులు

పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి

గణేష్ ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు, డీజే యజమానులు పోలీసు శాఖకు సహకరించాలని అత్తాపూర్ పోలీసులు కోరారు.

ప్రభుత్వం, పోలీసు శాఖ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు.

జారీ చేసిన వారు:
స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)
అత్తాపూర్ పోలీస్ స్టేషన్
రాజేంద్రనగర్ జోన్, హైదరాబాద్