బ్రేకింగ్ న్యూస్
వరకట్న మరణం కేసులో భర్త, అత్తమామలకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షసెప్టెంబర్‌లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్లు.. 35 మంది అరెస్ట్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్వరకట్న మరణం కేసులో భర్త, అత్తమామలకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షసెప్టెంబర్‌లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్లు.. 35 మంది అరెస్ట్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
Telangana

వరకట్న మరణం కేసులో భర్త, అత్తమామలకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష

వరకట్న మరణం కేసులో భర్త, అత్తమామలకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష

జహీరాబాద్‌లో 2022లో జరిగిన ఘటనపై తీర్పు వెలువరించిన సంగారెడ్డి ఫ్యామిలీ కోర్టు

నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, కోర్టు సిబ్బందికి ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందనలు

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన వరకట్న మరణం కేసులో ముగ్గురు నిందితులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంగారెడ్డిలోని ఫ్యామిలీ కోర్టు కమ్ IV అదనపు జిల్లా, సెషన్స్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి, న్యాయస్థానంలో కేసు విచారణకు సహకరించిన పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బందిని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ అభినందించారు.

కేసు వివరాల ప్రకారం.. జహీరాబాద్ పట్టణంలోని ఎన్‌జీఓస్ కాలనీకి చెందిన పసుల నికిత (19)కు 2021 మే 16న పసుల సాయికుమార్‌తో వివాహం జరిగింది. వివాహమైన రెండు నెలల తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని భర్త సాయికుమార్‌తో పాటు అత్తమామలు యాదప్ప, అనసూయ ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ వేధింపులను తట్టుకోలేక నికిత 2022 ఫిబ్రవరి 15న రాత్రి తాను నివసిస్తున్న అద్దె ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. మృతురాలి తల్లి బొడ్డుగారి మంజుల ఫిర్యాదు మేరకు 2022 ఫిబ్రవరి 16న జహీరాబాద్ టౌన్ పోలీసులు క్రైమ్ నంబర్ 47/2022 కింద ఐపీసీ సెక్షన్ 304(B)తో పాటు 34 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.

రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్

ఈ కేసులో మొదట దర్యాప్తు చేపట్టిన ఎస్‌ఐ కె. శ్రీకాంత్, అనంతరం దర్యాప్తు నిర్వహించిన ఎస్‌డీపీఓ జి. శంకర్ రాజు సాక్ష్యాధారాలను సేకరించి నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కేసు విచారణ అనంతరం ఫ్యామిలీ కోర్టు కమ్ IV అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఎం. సతీష్ కుమార్ ముగ్గురు నిందితులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.

ఈ కేసులో శిక్ష పడిన నిందితులు మృతురాలి భర్త పసుల సాయికుమార్, మామ యాదప్ప, అత్త అనసూయ.

కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన ఎస్‌ఐ కె. శ్రీకాంత్, తదుపరి దర్యాప్తు అధికారి ఎస్‌డీపీఓ జి. శంకర్ రాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. శ్రీరాములు, కోర్టు డ్యూటీ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శివకుమార్, హెడ్ కానిస్టేబుల్ కె. వెంకటేశ్వర్, లైజనింగ్ అధికారులుగా పనిచేసిన ఎస్‌ఐలు కె. సత్యనారాయణ, భిక్షపతిలను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందించారు.