Breaking News

సిగ్నల్ కాలనీ లో మహిళను చంపి, ఇంటి ముందు పాతి పెట్టిన కేసును చేధించిన మహబూబాబాద్ టౌన్ పోలీసులు.

సిగ్నల్ కాలనీ లో మహిళను చంపి, ఇంటి ముందు పాతి పెట్టిన కేసును చేధించిన మహబూబాబాద్ టౌన్ పోలీసులు. 5 గురు నిందుతుల అరెస్ట్, పరారులో మరొక నిందితుడు.

ఈ నెల 16 వ తారీఖున మహబూబాబాద్ పట్టణంలోని సిగ్నల్ కాలనీ లో భూపతి అంజయ్య ‘ఇంట్లో ఒక మహిళను పాతిపెట్టబడి ఉండగా, ఆ విషయంలో మహబూబాబాద్ టౌన్ పోలీస్ వారు Suspecios Death కింద కేసు నమోదు చేయనైనది. ఆ కేసును మహబూబాబాద్ టౌన్ పోలీస్ వారు సవాలుగా తీసుకొని, చేదించి, నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది.

క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలం, మొండికట్ట గ్రామంకు చెందిన కాటి రాములు లక్ష్మిలకు ఒక పాప, బాబు సంతానం. 12 సంవత్సరాల క్రితం బతుకుదేరువు కోసం వారు మహబూబాబాద్ కు వచ్చి సిగ్నల్ కాలనీలో ఒక రూమ్ కిరాయి తీసుకొని ఉండేవారు. వారి కొడుకు కాటి గోపి సుతారి పని కోసం ఏలూరు వెళ్ళగా అక్కడ నాగమణి అను ఆమె పరిచయం అయింది. ఆమెకు ఇదివరకే పెండ్లి అయి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పటికే ఆమె భర్త చనిపోయి ఉండగా ఆమెను మచ్చిక చేసుకొని, పెండ్లి చేసుకొని నాగమణిని ఆమె ఇద్దరు పిల్లల్ని మహబూబాబాద్ కు తీసుకొని వచ్చినాడు. కాటి గోపి నాగమణిని పెండ్లి చేసుకోవడం, కాటి రాములు అతని భార్య లక్ష్మి అల్లుడు కూతురు అయిన హెచ్చు మహేందర్, దుర్గ లకు ఇష్టం లేదు, దాంతో గోపి గుండ్ల కుంట కాలనీ లో ఒక రూమ్ కిరాయికి తీసుకొని కూలి పనులు చేసుకునేవారు. కొద్దిరోజులకు గోపి తన భార్యను తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళమంటే అందుకు ఆమె నిరాకరించడంతో అప్పటి నుండి గోపి తాగి వచ్చి నాగమణిని ఆమె ఇద్దరు కొడుకుల్ని కొట్టేవాడు. ఈ క్రమంలో నాగమణి ఇద్దరు కొడుకులు సంవత్సరంన్నర క్రితం ఇంట్లో నుండి పారిపోయి, ఆంధ్ర ప్రదేశ్ లోని మంగళగిరిలో వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటున్నారు. అయినా కూడా నాగమణి గోపి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళడానికి నిరాకరించడంతో తరుచూ ఆమెను కొట్టేవాడు. అదే క్రమంలో జనవరి నెల మొదటి వారంలో కూడా కాటి గోపి తన భార్య నాగమణి తో గొడవ పడి చేతులు, కర్రలతో HP గ్యాస్ ఆఫీస్ వద్ద బాగా కొట్టగా, ఆమెకు బలమైన దెబ్బలు తగలడంతో ఆమెను ఈ నెల 7 వ తారీఖున కాటి గోపి సిగ్నల్ కాలనీ లోని అతని తల్లిదండ్రులు, చెల్లె, బావలు కిరాయికి ఉంటున్న ఇంటికి తీసుకెళ్ళి, అదే రోజు ఆమె తలను ఇంట్లో బండల మీద గుద్ది చంపినాడు. ఆమెను చంపిన విషయం ఎవరికీ తెలియకూడదని అదే రోజు రాత్రి నాగమణి మృతదేహంను వాళ్ళు కిరాయికి ఉంటున్న ఇంటి ముందు కాటి గోపి అతని తల్లిదండ్రులైన కాటి రాములు, కాటి లక్ష్మి మరియు అతని చెల్లె బావ అయిన హెచ్చు మహేందర్, దుర్గ మరియు తన మేన మామ బత్తుల వెంకటేశ్వర్లు సహాయంతో బొంద తీసి దాంట్లో బొందపెట్టినారు. మళ్ళీ వారం రోజులకు నాగమణి మృతదేహంను బయటకు తీసి ఎక్కడైనా పెడదామని బొంద తీయగా వాసన వస్తుండడంతో నాగమణి మృతదేహం అదే బొందలో పాతిపెట్టి బయటకు వాసనరాకుండా దానిపైన రోజు అలుకు చల్లేవారు. ఈ క్రమంలో కాలనీ వాసులకు వాళ్ళ ఇంట్లో అందరూ ఉండి, నాగమణి కనిపించక పోవడంతో ఆమె ఆచూకి అడగడంతో వారు అందరూ ఈ సంక్రాంతి పండుగ రోజున ఇల్లు విడిచిపెట్టి పారిపోయారు.
ఈ కేసులలో నిందితుల అరెస్ట్ చేయుటకు మహబూబాబాద్ DSP N. తిరుపతి రావు, Mah-bad Town ఇన్స్పెక్టర్ P. దేవేందర్, K. శివ, Sl 1) M. రుద్రయ్య, PC-3501, 2) K. సుధీర్, PC-3969 ని అభినందించనైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *