ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్బంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ, అధికారులు, సిబ్బంది తో కలిసి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం మహనియులు తమ అమూల్యమైన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ,పొరాడి ప్రాణ త్యాగం చేసి అసువులు బాసిన అమరవీరుల జ్ఞాపకార్ధం కోసం స్మరించుకొనుటకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలమేరకు నేడు వారికి 2 నిమిషాల మౌనం పాటించడం జరిగిందని తెలియజేశారు.