76 వ గణతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపియస్. జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందితో కలిసి జాతీయగీతాలాపన చేసారు. అనంతరం సిబ్బందికి, సంగారెడ్డి జిల్లా ప్రజలందరికి 76 వ గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
1950 జనవరి 26న భారత రాజ్యాగం అమలులోకి వచ్చిందని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ రోజును గణతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తుచేశారు. రాజ్యాగం అనే పవిత్ర పుస్తకంలో పొందుపరిచిన నియమావళి ఆధారంగానే నేడు కుల,
మతాలకు అతీతంగా, కేవలం విద్యార్హతలతో ఉద్యోగాలు పొందగలుగుతున్నాం అన్నారు. పూర్వం చూసినట్లయితే రాజులు, వారి పిల్లలు ఇలా వారి తరతరాలు పాలించే వారు. కానీ రాజ్యంగం అమలు అనంతరం రాచరిక పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడటంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషించిందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు కల్పించిన ఓటు హక్కు ద్వారా ప్రజల చేత, ప్రజల కొరకు నాయకులను ఎన్నుకోవడం ద్వారా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. రాజ్యంగంలో ప్రతి విషయాన్ని కూలంకషంగా వివరిస్తూ ప్రభుత్వాలు ఏ విధంగా రూల్ చేయాలి, నాయకులను ఏ విధంగా ఎన్నుకోవాలి, అధికారులను ఏ విధంగా రిక్రూట్మెంట్ చేసుకోవాలి అన్న విషయాలను రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందన్నారు. ఎన్ని కులాలు, మతాలు ఉన్నప్పటికీ మనందరం ప్రశాంతంగా ఉన్నామంటే అందుకు ముఖ్య కారణం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనలే కారణం అన్నారు.
దేశ పౌరులుగా భారత దేశ ప్రగతికి తోడ్పడాలంటే బార్డర్లో వెళ్లి శత్రు దేశాలతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదని, మనకు కేటాయించిన పనిని అంకిత భావంతో నిర్వహించినప్పుడే దేశ ప్రగతికి బాటలు వేసినట్లు అవుతుందన్నారు. భారత రాజ్యంగ రచనలో అంబేద్కర్ కృషి మరువలేనిదని, భారత రాజ్యంగ విశిష్టతను ప్రతి పౌరుడు తెలుసుకొని, మహనీయుల బాటలో నడవాలని, ప్రతి ఒక్కరు తమ విధులను పూర్తి నిబద్దతతో నిర్వర్తిస్తూ దేశ ప్రగతికి పాటుపడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు.ఎస్పీ ఎ.సంజీవ రావ్, సంగారెడ్డి డియస్పి. సత్యయ్య గౌడ్, ఎఆర్.డియస్పి. నరేందర్, ఎస్.బి ఇన్స్పెక్టర్స్ విజయ్ కృష్ణ, డిసిఆర్.బి. ఇన్స్పెక్టర్ రమేష్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి, సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్, రూరల్ ఇన్స్పెక్టర్, ఆనంద్, ఆర్.ఐ.లు రాజశేఖర్, రామరావ్, డానియల్, శ్రీనివాస్, సూపరింటెండెంట్ వెంకటేశం, మరియు వివిధ వింగ్స్ కు చెందిన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సాయుధ పోలీసుదళ కార్యాలయం:
76 వ గణతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సాయుధ పోలీసుదళ కార్యాలయం (AR Hqrts) లో ఎఆర్.డియస్పి. నరేందర్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందితో కలిసి జాతీయగీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ.లు రాజశేఖర్, రామరావ్, శ్రీనివాస్, డానియల్ గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.