Breaking News

ఎస్-న్యాబ్, బిడిఎల్-భానూర్ పోలీసుల పనితీరును అభినందించిన – జిల్లా ఎస్పీ.

జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ఆదేశానుసారం బిడిఎల్-భానూర్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, సంగారెడ్డి జిల్లా ఎస్-న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావ్ సిబ్బందితో కలిసి పాటి X-రోడ్డు వద్ద ఉదయం అందాజ 11 గంటల సమయంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా హైదరాబాద్ వైపు నుండి సంగారెడ్డి జిల్లా ముత్తంగి వైపు సర్వీస్ రోడ్డు పై వస్తున్న 1) తెలుపు రంగు గల స్విఫ్ట్ డిజైర్ కారు నెంబర్ MH 02 CL 4145, 2) సిల్వర్ రంగుగల మహీంద్రా బొల్లేరో కారు OR 02 AM 5025, గల వాటిని ఆపి తనిఖీ నిర్వహించగా 55-ప్యాకెట్ల ఎండు గంజాయిని గుర్తించడం జరిగింది. దాని విలువ సుమారు 64 లక్షల రూపాయలు ఉంటుంది. నిందితులను అదుపులోకి తీసుకొని, వివరాలు అడిగి తెలుసుకొనగా ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాలోని సరఫరాదారు రాజ్‌ కుమార్ వద్ద నుంచి గంజాయి తెచ్చి, మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, మలేగావ్ ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు విచారణలో తెలుస్తున్నది. (1) ఫిరోజ్ అహ్మద్ కలీమ్ అహ్మద్, మలేగావ్, నాసిక్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రం. (2) సగర్ నాయక్ @ సగర్, గజపతి జిల్లా, ఒడిశా. (3) మెహబూబ్ అబ్దుల్ అహద్ @ అంసారీ, మలేగావ్, నాసిక్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రం. (4) మహ్మద్ ఇర్ఫాన్ మహ్మద్ అక్ఱమ్ @ ఇర్ఫాన్, మలేగావ్, నాసిక్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రం,గుర్తించిన 55- ప్యాకెట్లలో మొత్తం 128 కిలోల ఎండుగంజాయి, పై వ్యక్తుల నుండి 5-సెల్ ఫోన్లు, 2-కార్లను సీజ్ చేసి, క్రైమ్ నెంబర్ 220/2025 లో బిడిఎల్-భానూర్ పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు చేసి, నిందితులనుగౌరవ న్యాయస్థానం ముందు ప్రవేశ పెట్టడం జరుగుతుంది అన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జిల్లా పోలీసు శాఖ ఉక్కు పాదం మోపడం జరుగుతుందని, ఎవరైనా గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలను సాగు, సరఫరా చేసిన సంగారెడ్డి జిల్లా S-Nab నెంబర్ 8712656777 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఇట్టి కేసు చేదనలో కీలకంగా వ్యవహరించిన బిడిఎల్-భానూర్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, ఎస్ఐ వెంకటేశం, సంగారెడ్డి జిల్లా ఎస్-న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావ్ సిబ్బంది, క్లూస్ టీం సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

వాలెంటైన్స్ డే సందర్భంగా సైబర్ మోసాలపై హెచ్చరిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *