బ్రేకింగ్ న్యూస్
ప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతి
Uncategorized

17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్-స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ నందు బెటాలియన్ కమాండెంట్ ఎం.ఐ. సురేష్ జాతీయ జెండా ఎగురవేసి పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమాండెంట్ ఎం.ఐ. సురేష్ మాట్లాడుతూ మనమందరం 79వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషముగావుంది. స్వాతంత్య్ర దినోత్సవం అనేది మనల్ని, మన చరిత్రతో అనుసంధానించే ఒక అందమైన సందర్భం. మనం పీల్చే స్వేచ్ఛ వాయువుల వెనక ఎంతోమంది ప్రాణదానం ఉంది. మన స్వాతంత్య్ర దినోత్సవాన్ని చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించారు. భారత దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడం కోసం మహాత్మ గాంధి,సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహానుభావులు నేలకొరిగారు. బ్రిటీషర్లతో అలుపెరుగని పోరాటంలో కనుమరుగయ్యారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న భారతదేశం 200 సంవత్సరాల బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందింది. స్వాతంత్య్రాన్ని సంపాదించుకుంది. స్వాతంత్య్ర సమరయోధుల అపారమైన ధైర్యసాహసాలు, త్యాగాలే బ్రిటీష్ వారిని గద్దె దించి దేశాన్ని విముక్తం చేశాయి అని తెలియజేశారు. ఈ సందర్భముగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిలో ARSI లు జాకబ్ రమేష్ లకు ఉత్తమ సేవా పథకంలు అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రాందాస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీమతి ఇ . ప్రమీల,అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్