బ్రేకింగ్ న్యూస్
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టినేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
Uncategorized

సరియైన పత్రాలు లేని 120 మోటర్ సైకిల్స్,పది ఆటోలు, 15 ఆవు దూడలు సీజ్ – జిల్లా ఎస్పీ.

నకిరేకల్ పట్టణ పరిధిలో తెల్లవారు జామున నల్లగొండ డీఎస్పీ ఆధ్వర్యంలో 5 మంది సీఐలు 20 యస్.ఐలు TGSP సిబ్బంది 50 మందితో మొత్తం కలిపి 300 మంది పోలీస్ సిబ్బందితో దాదాపు 350 ఇళ్లల్లో సోదాలు నిర్వహించగా సరియైన పత్రాలు లేని మొత్తం 130 వాహనాలు పట్టుబడగా, వీటిలో 120 ద్వి చక్ర వాహనాలు,10 త్రీ చక్ర వాహనాలు,08 మంది అనుమానితులను గుర్తించడం జరిగిందని ఇందులో ఒక ఆస్తి సంబంధిత నేరస్తున్నీ అదుపులో తీసుకోవడం జరిగిందనీ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, తెలిపారు. అలాగే ఇతర దేశాలు నేపాల్ నుంచి వచ్చిన ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరిని ఆధారాలను చెక్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఒక షెడ్ లో అక్రమంగా ఉంచిన 15 ఆవు దూడలు పట్టుబడి చేయడం జరిగిందనీ వీటిని చట్టప్రకారం గోశాల కు తరలించడం జరుగుతుందని అన్నారు. అలాగే 18 గంజా సేవించినట్లుగా అనుమానితులను అదుపులోకి తీసుకొని వీరందరికీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా ముందస్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగా కమ్యూనిటి కాంటాక్టు లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దీనిలో భాగంగా నకిరేకల్ పట్టణంలో కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కాలనీల్లో,ఇంటి ప్రదేశాల్లో అనుమానితంగా ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. కొత్తగా ఇండ్లకు కిరాయిలకు వచ్చే వారి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ఆద్దెలకు ఇవ్వాలని సూచించారు. నేరరహిత పట్టణంగా తీర్చి దిద్దడంతోపాటు ప్రజలకు శాంతిభద్రతలు కల్పించాలని గంజాయి తదితర మాదకద్రవాలను నిలువరించడం కోసం కృషీ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో గంజాయిని ఆరికట్టడం కోసం మూడు దశల్లో కార్యాక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎక్కడైన గంజాయి సేవిస్తున్నట్లు,విక్రయించినట్లు, కానీ రవాణా చేస్తున్నట్లు కానీ తెలిస్తే డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. తప్పుడు డాక్యుమెంట్లతో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, నేర నియంత్రణకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి,సీఐలు రాఘవరావు, ఆదిరెడ్డి, కొండల్ రెడ్డి, కరుణాకర్, మహాలక్ష్మయ్య, ఎస్ఐలు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్