ఆపరేషన్ స్మైల్ -11 కార్యక్రమం ద్వారా జిల్లాలో 45 మంది బాలకార్మికులను రెస్క్యూ చేయడం జరిగిందని నోడల్ అధికారి అదనపు ఎస్పీ రాములు తెలిపారు.
01.01.2025 నుండి 31.01.2025 వరకు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ -11 కార్యక్రమం ద్వారా జిల్లాలో 45 (37 బాయ్స్ +8 గర్ల్స్) మంది బాలకార్మికులను రెస్క్యూ చేయడం జరిగింది అని జిల్లా నోడల్ అధికారి అదనపు ఎస్పీ తెలిపినారు. ఈ సందర్బంగా అదనపు ఎస్పీ వివరాలు వెల్లడిస్తూ ఆపరేషన్ స్మైల్ -11 కార్యక్రమాల ద్వారా బాలకార్మికులుగా పనిచేస్తున్న చిన్నారులు మరియు అక్రమ రవాణా కు గురి అవుతున్న చిన్నారులను గుర్తించి వారిని రక్షించి పునరావాసం కల్పించడం జరిగిందని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా లేబర్, ఉమెన్ & చైల్డ్ వెల్ఫేర్, NGO’s మరియు పోలీస్ అధికారులతో కలపి టీం ఏర్పాటు చేసి జిల్లాలోని వివిధ గ్రామాలలో పర్యటిస్తూ 45 (37 బాయ్స్ +8 గర్ల్స్) మంది బాల కార్మికులను రెస్క్యూ చేయడం గొప్ప విషయమని తెలియజేశారు. సంతోషంగా చదువుకుంటూ ఆటపాటలతో సాగాల్సిన చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తున్న బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. రెస్క్యూ చేసిన బాలల యొక్క పునరావాసం మరియు విద్యను కల్పించేలా మరియు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఆపరేషన్ స్మైల్ -11 నోడల్ అధికారి అయిన అదనపు ఎస్పీ రాములుని, SI మురహరి మరియు టీం సిబ్బంది యొక్క పనితీరును జిల్లా ఎస్పీ డి జానకి అభినందించారు.