మునిపల్లి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జిల్లా అదనపు. ఎస్పీ సంజీవ రావు మాట్లాడుతూ.. నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు తేది: 30.01.2025 నాడు ఉదయం 10.00 గంటల సమయంలో కొండాపూర్ సి.ఐ డి వెంకటేశ్, మునిపల్లి ఎస్.ఐ యం.రాజేష్ నాయక్, సిబ్బంది మరియు సిసియస్ సిబ్బందితో కలిసి మునిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గల కంకోల్ టోల్ ప్లాజా వద్ద NH-65 రోడ్డు పై వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, ముంబాయి వైపు నుండి హైదరాబాద్ వైపు అనుమానాస్పదంగా వస్తున్న వైట్ కలర్ మహీంద్ర బోలెరో పికప్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, ఆ బోలెరో పికక్ వాహనం డ్రైవరు సీటు వెనుకల ప్రత్యేకంగా క్యాబిన్ తయారు చేసి అందులో 32 కిలోల ఎండు గంజాయి (08) ప్యాకెట్స్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనపరుకోవడం జరిగింది. బోలెరో పికక్ వాహన డ్రైవరుతో సహా ఆ బోలెరో వాహనానికి పైలెట్ గా వస్తున్న మహీంద్రా బోలెరో వాహనం మరియు షిఫ్ట్ కారు లను 7 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు.
ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాకు చెందిన బికాస్కుమార్మాలీ, రావు సాహెబ్ గెనాకాలే, దూకల్లెవసంత్బాబురావు, హన్మంత్రామదాస్పవార్ లు గ్యాంగ్ గా ఏర్పడి, బికాస్ కుమార్ మాలీ ఒడిష రాష్ట్రంలో ఎండు గంజాయిని సేకరించి, ఎవరికి తెలియకుండా కార్లలో మరియు ప్రత్యేకంగా క్యాబిన్ తయారు చేసిన బోలెరో వాహనాలలో మహారాష్ట్రకు తీసుకువచ్చి, అక్కడి నుండి రావు సాహెబ్ గెనాకాలే, దూకల్లె వసంత్బాబురావు, హన్మంత్రామదాస్పవార్ ల సహాయంతో కర్ణాటక రాష్ట్రంలోని బీదర్, గుల్బర్గా, మహారాష్ట్ర లోని పూణే , సోలాపూర్, మాలెగావ్, వాశి మరియు గోవాకు చెందిన వారికి అమ్మి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తున్నారు. మిగతా ఇద్దరు నేరస్తులు రావు సాహెబ్ గెనాకాలే, కృష్ణ పరారీ లో ఉన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మిగాత వారిని కూడా త్వరలో అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడం జరుగుతుందన్నారు.
స్వాధీనపర్చుకొన్న సొత్తు వివరాలు : 32 కిలోల ఎండు గంజాయి, నగదు రూ: 50,000/-లు, (1). Bolero Pikup vehicle(2) Swift car No. MH 45AU1747 మరియు 10- సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు.
ఈ ప్రెస్ మీట్ నందు డి.వెంకటేశ్ సిఐ కొండాపూర్ సర్కిల్, యం రాజేష్ నాయక్ ఎస్ఐ మునిపల్లి, వి.శివ కుమార్ ఇన్స్పెక్టర్ సిసియస్ సంగారెడ్డి, పి.రాము నాయుడు ఇన్స్పెక్టర్ సిసియస్ సంగారెడ్డి, శ్రీకాంత్ ఎస్ఐ సిసిఎస్, మరియు సిసియస్ సిబ్బంధి మాణిక్ రెడ్డి ఏఎస్‌ఐ, హెడ్.కానిస్టేబుల్ రెఖ్య, కానిస్టేబుల్స్ మతీన్, శశి, అన్వర్, సలీం, ప్రశాంత్, వందాస్, ఉదయ్ కిరణ్, మోహన్, సతీష్, ఆసిఫ్ మరియు మునిపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.