బ్రేకింగ్ న్యూస్
ట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలిక్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయినకిలీ స్క్రీన్‌షాట్‌తో నగదు మోసం.. పాత నేరస్థుడి అరెస్ట్గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుపై ఉన్నతాధికారుల సమన్వయ సమావేశంకాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ డా. శబరీష్ IPSప్రజల సమస్యల సత్వర పరిష్కారానికే ‘ప్రజావాణి’: సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్గణేష్ ఉత్సవాలపై అత్తాపూర్ పోలీసులు కీలక హెచ్చరిక.. భారీ డీజే సౌండ్ సిస్టమ్‌లపై నిషేధంహైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులుఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తుట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలిక్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయినకిలీ స్క్రీన్‌షాట్‌తో నగదు మోసం.. పాత నేరస్థుడి అరెస్ట్గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుపై ఉన్నతాధికారుల సమన్వయ సమావేశంకాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ డా. శబరీష్ IPSప్రజల సమస్యల సత్వర పరిష్కారానికే ‘ప్రజావాణి’: సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్గణేష్ ఉత్సవాలపై అత్తాపూర్ పోలీసులు కీలక హెచ్చరిక.. భారీ డీజే సౌండ్ సిస్టమ్‌లపై నిషేధంహైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులుఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
Telangana

ట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలి

ట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలి

నల్గొండ, సెప్టెంబర్ 10: ట్రాన్స్‌జెండర్లు సమాజంలో ప్రతి ఒక్కరినీ గౌరవిస్తూ, చట్టాలను పాటిస్తూ గౌరవప్రదమైన జీవనం సాగించాలని నల్గొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి సూచించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయడం లేదా వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నల్గొండ పట్టణ పరిధిలోని ట్రాన్స్‌జెండర్లతో డీఎస్పీ ప్రత్యేక అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

బలవంతపు వసూళ్లకు పాల్పడొద్దు

వ్యాపార సంస్థలు, దుకాణాలు, ఇళ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, పండుగలు, శుభకార్యాలు తదితర సందర్భాల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయడం లేదా వసూలు చేయడం చేయరాదని డీఎస్పీ స్పష్టం చేశారు.

ఎవరైనా స్వచ్ఛందంగా అందించే సహాయాన్ని మాత్రమే స్వీకరించాలని సూచించారు. డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడం, బెదిరించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, ప్రజలను వేధించడం వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు

ప్రజల నుంచి ట్రాన్స్‌జెండర్లపై వేధింపులు, బెదిరింపులు లేదా బలవంతపు వసూళ్లకు సంబంధించిన ఫిర్యాదులు అందితే వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి, నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.

అదే సమయంలో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు, వేధింపులు లేదా ఇతర చట్టపరమైన సమస్యలు ఉంటే భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. పోలీస్ శాఖ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

క్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి

పరస్పరం గౌరవంతో వ్యవహరించాలి

ట్రాన్స్‌జెండర్లు కూడా సమాజంలో ఒక భాగమేనని డీఎస్పీ శివరాం రెడ్డి పేర్కొన్నారు. వారి పట్ల ప్రతి ఒక్కరూ గౌరవభావంతో వ్యవహరించాలని, అదే విధంగా వారు కూడా ప్రజల హక్కులు, స్వేచ్ఛకు భంగం కలగకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.

శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.

ఈ అవగాహన కార్యక్రమంలో సీఐలు ఆదిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎస్‌ఐలు సైదాబాబు, షరీఫ్‌తో పాటు జిల్లాలోని పలువురు ట్రాన్స్‌జెండర్లు పాల్గొన్నారు.