పోలీసుల సేవలు, అమరవీరుల త్యాగాలను ప్రతిబింబించేలా సృజనాత్మక చిత్రాలు రూపొందించాలి: ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్
పోలీసుల సేవలను, అమరవీరుల త్యాగాలను, ప్రజల భద్రత కోసం పోలీసులు చేస్తున్న కృషిని ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల సందర్భంగా షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో భాగంగా మూడు నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్‌లను రూపొందించాలని సూచించారు.
ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఇతర సృజనాత్మక ప్రతిభ కలిగిన వారు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని ఎస్పీ తెలిపారు. పోలీసుల విధులు, ప్రజలకు అందిస్తున్న సేవలు, పోలీస్–ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, అమరవీరుల త్యాగాలు, మహిళలు, చిన్నారుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రత, నేరాల నియంత్రణ, సామాజిక అవగాహన కార్యక్రమాలు వంటి అంశాలపై ఫోటోలు, షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించాలని కోరారు.
పోలీసుల అంకితభావం, త్యాగనిరతి, ప్రజా సేవలను ప్రతిబింబించేలా వినూత్న ఆలోచనలతో చిత్రాలను రూపొందించి ఈ పోటీల్లో పాల్గొనాలని ఎస్పీ సూచించారు.
