Breaking News

భీమారెడ్డి మరియు ఏఎస్ఐ తారాచంద్ కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు.

ఈరోజు పదవి విరమణ పొందిన ఎస్ఐ భీమారెడ్డి మరియు ఏఎస్ఐ తారాచంద్ కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోల కార్యక్రమం

పోలీస్ డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని ఈరోజు పదవీ విరమణ చేసిన భీమారెడ్డి మరియు తారాచంద్ కు జిల్లా పోలీస్ కార్యాలయంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శాలువా కప్పి జ్ఞాపిక అందచేసి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు

ఈ సందర్భంగా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘంగా 40 సంవత్సరాల సర్వస్ పూర్తి చేసుకుని కానిస్టేబుల్ నుండి ఎస్.ఐ, ఏఎస్ఐ వరకు పదవోన్నతి పొంది ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినారని శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీస్ విభాగంలో సుధీర్ఘకాంగా విధులు నిర్వహించి పదవీవిరమణ చేసిన సిబ్బంది సేవను మరువమని, పదవీవిరమణ చేసిన మీరు పోలీస్ కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చిన తనను సంప్రదించ వచ్చని అన్నారు “ పోలీసు రిటైర్ మెంట్ కేవలం తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదు” అని కొనియాడారు. విధి నిర్వహణలో పగలనక, రాత్రనక, పండగల సమయంలో భార్యా, పిల్లలకు దూరంగా ఉండి విధులు నిర్వహించినారు. పదవి విరమణ చేసిన పోలీసులు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావిజీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు . అత్యవసరం అయినప్పుడు రిటైర్డ్ అయిన పోలీస్ అధికారుల సేవలు వినియోగించుకుంటారని తెలిపారు.

క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి

ఈ కార్యక్రమంలో డిఎస్పీ తిరుపతి రావు, సీఐ దేవేందర్,ఆర్.ఐ నాగేశ్వర్రావు పదవి విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *